
బెంగళూరు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐటీ ప్రాజెక్టులు, ట్రాఫిక్ సమస్యలు, అంతకుమించి ప్రాణాలను పిండేసే గుంతల రోడ్లు. రోజూ ప్రయాణంలో వాహనాలు దెబ్బతిని, గుంతల్లో పడి నడుములు విరగ్గొట్టుకునే పరిస్థితులపై మనలో చాలామంది శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక యువ ఇంజనీర్ మాత్రం ఆ కోపానికే కొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ.. రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి, సంబంధిత కాంట్రాక్టర్‌పై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అత్యంత శక్తివంతమైన యాప్‌ను రూపొందించి సంచలనం సృష్టించాడు.తన కారు గుంతల్లో పడి తరచూ పాడైపోతుండటంతో విసిగిపోయిన ఈ ఇంజనీర్, అత్యాధునిక కోడెక్స్ ప్రాసెస్ సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాడు. దీనికోసం తన కారుకు జీపీఎస్ , యాక్సిలెరోమీటర్ సౌకర్యం ఉన్న ఒక డ్యాష్ క్యామ్‌ను అమర్చాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు కదిలే తీరు, రోడ్డుపై ఉండే దృశ్యాలను ఈ కెమెరా నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇందులో అమర్చిన విజన్ మోడల్ సాంకేతికత రోడ్డుపై ఉండే ప్రతి గుంతను విశ్లేషించి.. అది చిన్నదా, మధ్యస్థమైనదా లేక ప్రాణాంతకమైన పెద్ద గుంతనా అనే విషయాన్ని క్షణాల్లో వర్గీకరిస్తుంది. గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవుగా- మెడికల్ కాలేజీ అంటే నమ్మాలా?- అయ్యన్నక్యాచింగ్ పాయింట్.. 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటా రీడింగ్!ఈ యాప్‌లో అసలైన మాస్టర్ ప్లాన్ ఇక్కడే ఉంది! భారతదేశంలో చాలా వరకు ప్రధాన రహదారులకు కాంట్రాక్టర్ల ఫ్రీ మెయింటైనెన్స్ గ్యారంటీ ఉంటుంది. నిబంధనల ప్రకారం రోడ్డు పాడైతే ఆ కాంట్రాక్టరే ఉచితంగా బాగు చేయాలి. దీనికోసం సదరు ఇంజనీర్ రూపొందించిన యాప్, దాదాపు 2,900 ప్రభుత్వ టెండర్ కాంట్రాక్ట్ పత్రాలను క్షుణ్ణంగా శోధిస్తుంది. గుంతలున్న నిర్దిష్ట రహదారి టెండర్ నంబర్ ఏమిటి? ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరు? బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ అధికారి ఎవరు? అనే వివరాలను చిటికెలో లాగేస్తుంది.కర్నాటక సర్కార్ కు బెంగళూరు వాసుల హెచ్చరిక..!