
బెంగళూరు నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఆమెను కిందపడేసి, మెడలోని 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి (Bengaluru Chain Snatching). బాధితురాలు విజయమ్మ దొడ్డబిదరకల్లు ప్రాంతంలో పాల దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కున్నారు. దుండగులు లాగడంతో విజయమ్మ కిందపడిపోయారు. సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే తెల్లవారుజాము కావడంతో చుట్టు పక్కల ఎవరూ లేరు (Bengaluru Crime News). ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది (25 Gram Gold Chain). బైక్‌పై వచ్చిన వ్యక్తులు మహిళను అడ్డుకుని దాడి చేసి, నగలతో పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు.. మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక