© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో (Times Square) జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. మంగళవారం క్వీన్స్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో టైమ్స్ స్క్వేర్ వద్ద వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకి కూడా దూసుకెళ్లడంతో వారు కాల్పులు జరిపారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఈ దాడిలో మృతిచెందిన ఎరిన్ పియాసెంటి (Erin Piacenti) బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఐదు నెలల మాతృత్వపు సెలవుల అనంతరం ఉద్యోగానికి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త, చిన్నారితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎరిన్ మృతిపై బ్యాంక్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.