
పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లు గెలిస్తేనే నాగినీ డ్యాన్సులతో రోత పుట్టించే జట్టుగా బంగ్లాదేశ్‌కు పేరుంది. అలాంటి పిల్లబచ్చా టీమ్ అయిన బంగ్లాదేశ్, పెద్దపులి లాంటి ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ దేశంలో తమ తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు ఆడిన బంగ్లాదేశ్.. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయం ఒక్క మ్యాచ్‌లో వచ్చిన అద్భుతం మాత్రమే కాదని, గత కొంతకాలంగా బంగ్లాదేశ్ క్రికెట్లో కనిపిస్తున్న మార్పులకు ఫలితమని విశ్లేషకులు భావిస్తున్నారు. డార్విన్ విజయంలో హసన్ మహ్మూద్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/55తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీసిన అతడు.. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ నహీద్ రాణా లేకపోయినా బంగ్లాదేశ్ పేస్ విభాగం బలహీనపడకపోవడం జట్టు బెంచ్ బలాన్ని చూపించింది. హసన్ మహ్మూద్ ఇటీవల కెంట్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడటం కూడా అతని ఆస్ట్రేలియా ప్రదర్శనకు ఉపయోగపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్లేషించింది. ఆస్ట్రేలియాపై మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైన తర్వాత బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. ఇందులో తంజీద్ హసన్ 101 పరుగుల ఇన్నింగ్స్ అత్యంత కీలకం. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. కేవలం రెండో టెస్టులోనే ఇంత కీలక ఇన్నింగ్స్ ఆడటం బంగ్లాదేశ్ కొత్త తరం ఆత్మవిశ్వాసానికి సంకేతంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసిన మిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియా మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. అతని స్పిన్‌కు స్టీవ్ స్మిత్ సహా కీలక బ్యాటర్లు చిక్కారు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మిరాజ్