
ఇంట్లో పండించిన తాజా పండ్లను తినాలని చాలామందికి ఉంటుంది. కానీ, నగరాల్లో స్థలం లేకపోవడం, సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాలతో చాలామంది ఆసక్తి ఉన్నా వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం, తక్కువ శ్రమతో, చిన్న కుండీల్లోనే పెంచుకోగలిగే కొన్ని పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటి సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించకపోయినా, అప్పుడప్పుడు నీళ్లు పోయడం మర్చిపోయినా ఇవి తట్టుకుని నిలబడతాయి. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. బాల్కనీలు లేదా పరిమిత స్థలంలో పెంచుకునేందుకు అనువైన ఆ 5 మొక్కలేంటో ఇప్పుడు చూద్దాం.జామ (Guava): ఈ జాబితాలో మొదటిది జామ మొక్క. ఇది ఎలాంటి నేలలోనైనా సులభంగా పెరుగుతుంది. అప్పుడప్పుడు నీళ్లు పోయడం మర్చిపోయినా తట్టుకుంటుంది. చీడపీడల బెడద కూడా తక్కువే. కనీసం ఒక అడుగు వ్యాసం ఉన్న కుండీలో నాటితే, ఒకటి లేదా రెండేళ్లలోనే ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.స్ట్రాబెర్రీ (Strawberry): వీలైనంత త్వరగా ఫలితాలు కావాలనుకునే వారికి స్ట్రాబెర్రీ ఉత్తమ ఎంపిక. నాటిన కొన్ని నెలల్లోనే తియ్యని పండ్లను అందిస్తుంది. దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. వేలాడే కుండీలు (hanging baskets) లేదా చిన్నపాటి టబ్బుల్లో కూడా వీటిని సులువుగా పెంచుకోవచ్చు.అంజీర్ (Fig): అంజీర్ మొక్కకు కూడా పెద్దగా శ్రద్ధ అవసరం లేదు. ఎండ తగిలే బాల్కనీలో పెడితే చాలు. దీనికి స్వీయ పరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి, ఫలాల కోసం మరో మొక్క అవసరం లేదు. కాకపోతే, క్రమం తప్పకుండా కొమ్మలను కత్తిరించడం (pruning) అవసరం.దానిమ్మ (Pomegranate)