© 2026 nimisham.in

అయోధ్య, దిల్లీ: విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయానికి తొలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)ని నియమించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధమవుతోంది. ఈ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ట్రస్టు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18 వరకు గడువు విధించింది. కాంట్రాక్టు పద్ధతిలో మూడేళ్ల పదవీకాలానికి సీఈవోను నియమిస్తామని, పనితీరు ఆధారంగా తర్వాత పొడిగింపు ఉంటుందని పేర్కొంది. రామాలయం విరాళాల చోరీపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ నియమిత సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లకు సమాధానం ఇవ్వాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. సిట్ దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ధర్మాసనానికి సమర్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.