
Australia vs Bangladesh, 1st Test: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలకు పసికూన బంగ్లాదేశ్ పేసర్లు గట్టి షాకే ఇచ్చారు. తొలి సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వార్త రాసే సమయానికి అంటే లంచ్ బ్రేక్ వరకు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే ఉత్కంఠగా మారింది. సొంతగడ్డపై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. హసన్ మహమూద్ దాటికి పెవిలియన్ చేరిన ఓపెనర్లు.. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు హెడ్, వెదర్‌ఆల్డ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. బంగ్లాదేశ్ యంగ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో చెలరేగిపోయాడు. తొలుత 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హసన్, ఆ వెంటనే 23 పరుగులు చేసిన జేక్ వెదర్ఆల్డ్ను వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి పెవిలియన్ బాట పట్టించాడు. దాంతో 50 పరుగుల లోపే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. Round the wicket, angling the ball onto the stumps, angled bat and back to the pavilion. Disappointing innings of 22 (39) v Bangladesh.#AUSvsBAN #SRH #IPL2027 — Varun Velamakanti 🦅 (@CricVarunSRH) August 13, 2026 రెండు వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్