
IPL 2027 Auction : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు జరగబోయే వేలంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు ఎవరనే దానికంటే.. సీజన్ ప్రారంభమైనప్పుడు నిజంగా ఎవరు అందుబాటులో ఉంటారనే ప్రశ్నే కీలకంగా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటంతో ఆ జట్టుకు చెందిన పలువురు స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027లో పూర్తిస్థాయిలో ఆడతారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఇప్పటికే ఆటగాళ్ల ఐపీఎల్ అందుబాటుపై తుది నిర్ణయం భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ అనంతరం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వేలం సమయంలో ఎలా వ్యవహరిస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ ఆటగాళ్లకు భారీ ధరలు.. ఐపీఎల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది. 2024 వేలంలో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర. అదే వేలంలో ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. అయితే 2027 వేలంలో ఆటగాడి ప్రతిభతో పాటు అతని అందుబాటు కూడా ధరను నిర్ణయించే కీలక అంశంగా మారవచ్చు. స్టార్ ఆటగాడు దూరమైతే ప్రత్యామ్నాయం దొరకడం కష్టమే.. ఒక ఫ్రాంచైజీ భారీ మొత్తానికి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. అతను అంతర్జాతీయ బాధ్యతల కారణంగా ఐపీఎల్‌కు దూరమైతే ఆ జట్టుకు సమస్యలు ఎదురవుతాయి. ఆ స్థాయి ఆటగాడిని ప్రత్యామ్నాయంగా తీసుకురావడం ప్రాంఛైజీకి కష్టమవుతుంది. ఐపీఎల్ జట్టులో గరిష్ఠంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే అవకాశం ఉండటంతో ప్రతి విదేశీ స్లాట్‌కు ప్రత్యేక విలువ ఉంటుంది. స్టార్ ఆటగాళ్లు తగ్గితే.. మిగిలిన వారికి భారీ ధరలు? ఇక్కడే వేలంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోవచ్చు. పలువురు ఆస్ట్రేలియా స్టార్