
ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యర్థులను తన ఆటతో కంగారు పెట్టించే ఆస్ట్రేలియా వెనుకడుగు వేసింది. బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమితో విమర్శలు ఎదుర్కొంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితం ఎలా ఉన్నా స్క్వాడ్‌ను మార్చేందుకు ఆసీస్ మొగ్గు చూపదు. కానీ, బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో ఆసీస్ వెనుకంజలోఉంది. రెండో టెస్టులోనైనా గెలిచి సిరీస్నను కోల్పోకుండా ఉండాలనేది ఆసీస్ ఆలోచన. అందుకోసం సెకండ్ టెస్టు కోసం తన తుది జట్టులో మార్పులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన జేక్ వెదర్లాడ్ను తప్పించింది. పాత ఓపెనర్ మాథ్యూ రెన్షాకు అవకాశం ఇచ్చింది. వెదర్లాడ్ తొలి టెస్టులో 23, 0కే పెవిలియన్ చేరాడు. దీంతో అతడిపై వేటుపడింది. వెదర్లాడ్ స్థానంలో వచ్చిన రెన్షా చివరిసారిగా ఆసీస్ తరఫున మూడేళ్ల కిందట టెస్టు మ్యాచ్ ఆడటం గమనార్హం. దిల్లీ వేదికగా భారత్‌తో 2023లో రెన్షా టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అవకాశాలు రాకపోయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో మాత్రం ప్లేస్ సంపాదిస్తున్నాడు. మరోవైపు బంగ్లాతో తొలి టెస్టు విఫలమైన స్టార్ ఆటగాడు మార్నస్ లబుషేన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆగస్టు 22 నుంచి ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టు కోసం ఆసీస్ స్క్వాడ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు