
AUS vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టుకు జట్టులో ఓ కీలక మార్పు చేసింది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ మాథ్యూ రెన్షాను జట్టులోకి తీసుకుంది. ఆగస్టు 22 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో వెదరాల్డ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే రెన్షాను జట్టులోకి తీసుకున్నారు. కాగా.. రెన్షా టెస్టు మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లు అయింది. చివరి సారిగా అతడు 2023లో ఢిల్లీలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆడాడు. IND vs SL : కేఎల్ రాహుల్ బ్రొమాన్స్.. కాపాడాడు అని ముద్దు పెట్టబోయాడు.. వీడియో వైరల్.. సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికి కూడా 30 ఏళ్ల రెన్షా వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. BREAKING: Aussies announce one change to the squad for Mackay Test #AUSvBAN — cricket.com.au (@cricketcomau) August 18, 2026 తొలి టెస్టు మ్యాచ్‌లో విఫలమైన మార్నస్ లబుషేన్ మాత్రం తన ప్లేస్‌ను కాపాడుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే.. పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్