© 2026 nimisham.in
బుల్లితెరపై 24 గంటలు వినోదానికి కొరత ఉండదు. ఎప్పుడు ఏ ఛానెల్ పెట్టినా ఏదో ఒక సినిమా ఛానెల్లో వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు టీవీ అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక సపరేట్గా సినిమాల కోసమే కొన్ని ఛానెల్స్ ఉంటాయి. మరి రేపు అంటే శనివారం (ఆగస్ట్ 22) ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ పారాడాక్స్ ఎఫెక్ట్, రెండు గంటలకు కొండవీటి దొంగ రానుంది. ఈటీవీలో 9 గంటలకు, 12 గంటలకు కూడా శ్రీ మంజునాథ రిపీట్ మోడ్‌లో రానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మహానగరంలో మాయగాడు, రాత్రి తొమ్మిదిన్నరకి మా ఆవిడ కలెక్టర్ రానుంది. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు చంటబ్బాయ్, 10 గంటలకు రిక్షావోడు, ఒంటి గంటకు దొంగ మొగుడు, 4 గంటలకు కొదమ సింహం, 7 గంటలకు శ్రీ మంజునాథ, 10 గంటలకు రుస్తుం, మిడ్ నైట్ ఒంటి గంటకు చంటబ్బాయ్ రానుంది.జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు శంకర్ దాదా ఎంబీబీఎస్, మూడున్నరకి గ్యాంగ్ లీడర్.. జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు గూఢాచారి నంబర్ 1, నాలుగున్నరకి ప్రేమగోల, జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి మూగ నోము, ఉదయం నాలుగున్నరకి చాణక్య శపథం, 7 గంటలకు స్వయం కృషి, 10 గంటలకు బిందాస్, ఒంటి గంటకు మనసంతా నువ్వే, నాలుగు గంటలకు లంకేశ్వరుడు, 7 గంటలకు బావగారు బాగున్నారా, 10 గంటలకు గాయం ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం మూడు గంటలకు సుప్రీమ్, 9 గంటలకు సిరై రానుంది. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 3 గంటలకు రెడీ, 7 గంటలకు సుడిగాడు, 9 గంటలకు అఆ, 12 గంటలకు హత్య, 3 గంటలకు తంత్ర, ఆరుగంటలకు ఇంద్ర
, 9 గంటలకు ఆపరేషన్ జావా, అర్దరాత్రి 12 గంటలకు మళ్లీ అఆ రానున్నాయి.స్టార్ మా మూవీస్‌లో తెల్లవారు ఝామున మూడు గంటలకు మనసు మాట వినదు, ఏడు గంటలకు వినరో భాగ్యము విష్ణుకథ, 9 గంటలకు ఖైదీ నంబర్ 150, 12 గంటలకు మిర్చి, మూడు గంటలకు సింగం, ఆరు గంటలకు పుష్ప, రాత్రి ఎనిమిదిన్నరకి ఆదికేశవ రానున్నాయి. స్టార్ మా గోల్డ్‌లో ఉదయం రెండున్నరకి మొగుడ్స్ పెళ్లామ్స్, 5 గంటలకు వీరభద్రుడు, 8 గంటలకు పసివాడి ప్రాణం, 11 గంటలకు రాజా విక్రమార్క, రెండున్నరకి హీరో, ఐదుగంటలకు అందరివాడు, 8 గంటలకు రౌడీ అల్లుడు, 11 గంటలకు రాజా విక్రమార్క మళ్లీ రిపీట్ చేయనున్నారు.