ఆదివారం అంటే అందరికీ పండుగే. అందరూ ఇంట్లో కూర్చుని టీవీలకు అతుక్కుపోతారు. ఇక సండే ఫండే అయ్యేలా ప్రతీ చానెల్లో అరడజనుకు పైగా సినిమాల్ని ప్రసారం చేస్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ షోలతో పాటుగా కంటిన్యూ సినిమాల్ని కూడా అందిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఆదివారం నాడు ఏ ఏ ఛానెల్లో ఏ సినిమా ఏ టైంకి వస్తుందో తెలుసుకుందాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఈటీవీలో 12 గంటలకు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి మళ్లీ రాత్రి పదిన్నరకు ఇదే సినిమా రిపీట్ మోడ్‌లో రానుంది. ఈటీవీ ప్లస్‌లో అయితే ఉదయం 9 గంటలకు దొంగ రాముడు అండ్ పార్టీ, 12 గంటలకు శత్రువు, సాయంత్రం ఆరున్నరకి యమగోల, రాత్రి పదిన్నరకి మంగమ్మ గారి మనవడు రానున్నాయి. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ఊహా, 10 గంటలకు వయ్యారి భామలు వగలమారి అత్తలు, ఒంటి గంటలకు ఆయనకి ఇద్దరు, నాలుగు గంటలకు అలీబాబా అరడజను దొంగలు, 7 గంటలకు 90స్ బయోపిక్, పది గంటలకు ఆత్మబలం, అర్దరాత్రి ఒంటి గంటలకు మళ్లీ ఊహ ప్రసారం కానుంది.జెమినీ టీవీలో ఉదయం ఆరు గంటలకే మస్కా, 9 గంటలకు ఊపిరి, 12 గంటలకు గోవిందుడు అందరివాడేలే, మూడున్నరకి బిచ్చగాడు, ఆరు గంటలకు బిచ్చగాడు, తొమ్మిదన్నరకి 7జీ బృందావన కాలనీ రానున్నాయి. జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ఒంటరి పోరాటం, నాలుగున్నరకి డింగ్ డాంగ్ బెల్, జెమినీ మూవీస్‌లో ఉదయం ఒకటిన్నరకి నీకు నాకు డ్యాష్ డ్యాష్, ఉదయం నాలుగున్నరకి జూనియర్, 7 గంటలకు ఓయ్, 10 గంటలకు బీస్ట్, ఒంటి గంటకు సాహస వీరుడు సాగరకన్య, నాలుగు గంటలకు మహావీరుడు, 7 గంటలకు బొబ్బిలి సింహం, 10 గంటలకు బ్రోకర్ ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు హే బల్వంత్, 12 గంటలకు మా అన్నయ్య, సాయంత్రం