
Amavasya Effect On Zodiac Signs : హిందూ సంప్రదాయాల్లో అమావాస్యకు ఎంతో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే, ఆగస్టు 12న శ్రావణ అమావాస్య వస్తుంది. దీనిని శ్రావణ మాస కృష్ణ అమావాస్య అనికూడా అంటారు. అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ఈ అమావాస్య రోజు పలు గ్రాహాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా నాలుగు రాశులకు కష్టాలు తప్పవని పలువురు జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. మేషరాశి.. మేష రాశి వారికి ఈ సమయంలో కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కన్యా రాశి.. కన్యా రాశి వారికి అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యం కావడం, ఆదాయం తగ్గడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండేందుకు ఓపికతో వ్యవహరించాలి. అప్పుడే ఈ రాశివారు తమకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి కుటుంబపరమైన సమస్యలు మానసిక ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇంట్లో అనుకోని గొడవలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న డబ్బు వేగంగా ఖర్చయ్యే పరిస్థితులు రావచ్చు. శుభకార్యాలకు సంబంధించిన పనుల్లో కూడా ఆలస్యం ఉండవచ్చు. ఏ పని చేపట్టాలన్నా ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరి సలహాలు తీసుకొని, ఆచితూచి ముందుకెళ్లాలి. కుంభ రాశి.. కుంభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. పరిష్కారమవుతాయని భావించిన కొన్ని సమస్యలు మరింత పెద్దవిగా మారవచ్చు. అందువల్ల ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వార్తలో