© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Grahanam 2026: ఆగష్టు 12న శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్‌లో ఎక్కడా కనిపించదు. ఈ గ్రహణం ఐరోపా ఖండంతో పాటు ఆసియా ఖండపు ఉత్తర భాగంతో పాటు ఆఫ్రికాలో ఉత్తర, పశ్చిమ భాగాల్లో ఉత్తర అమెరికా, పసిఫిక్ మహా సముద్రము, ఆర్కిటిక్, అంట్లాటిక్ ప్రాంతాల్లోకనిపించను. స్పెయిన్, ఐస్లాండ్, గ్రీన్లాండ్ దేశాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్యగా పిలుస్తారు. అటు డెన్మార్క్, పోలెండ్, నార్వే, స్వీడన్, కెనడా, నార్వే, గ్రీన్లాండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, అల్జీరియా దేశాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఓవరాల్‌గా 55 దేశాల్లో కనిపించనుంది. సాయంత్రం 7 గంటలకు పాక్షికంగా సూర్య గ్రహణం ప్రారంభం కానుంది. సంపూర్ణ గ్రహణ ప్రారంభం.. రాత్రి దాదాపు 9.15 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 11.17 నిమిషాలకు గ్రహణం ఓ మోస్తరు వరకు ఉండబోతుంది. రాత్రి సుమారు (ఆగష్టు 13) 1.20 గంటకు వరకు ుంటుంది. తెల్లవారుఝాము 3.30 గంటల వరకు ఉండబోతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు రెండు నిమిషాలు కనిపించకుండా పోతాడు. మొత్తంగా చీకటి అలముకుంటుంది. ఆ తర్వాత సూర్యుడి బాహ్యవలయమైన ‘కరోనా’ క్లియర్‌గా కనిపిస్తుంది. యూరప్ ఖండాల్లో పాక్షిక గ్రహణం కొనసాగుతున్న సమయంలోనే
సూర్యాస్తమయం జరగుతుంది. దీనిని ‘గ్రహాస్తమయ గ్రహణం’ అంటారు.
మన దేశంలో ఎక్కడా ఈ గ్రహణం కనబడదు. కనపబడని గ్రహణానికి ఎలాంటి ఆచారాలు, పట్టింపులు ఉండవు. ఈ గ్రహణానికి సూతకం, దేవాలయాలను మూసివేయడం.. ఆహార నియమాలు పాటించడం.. ప్రత్యేక శాంతులు వంటి ఆచారాలు అవసరం లేదు. ఇది కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో కేతు గ్రస్త సూర్య గ్రహణం.
ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు ఎలాంటి సూతకం లేకపోయినా.. ప్రత్యేకంగా జప, తపాదులు, శాంతి చేసుకోవచ్చు. గ్రహణం కనిపించే దేశాల్లో ఉండే హిందు ధర్మాన్ని ఆచరించే ప్రజలు, సనాతన వాదులు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి.
కర్కాటక, సింహ, మేషం, ధనుస్సు రాశి వారికి కొంచెం చెడు ఫలితాలు ఉండనున్నాయి.
వృషభ, కుంభ, తుల, కన్య రాశుల వారికి అనుకూల ఫలితాలుంటాయి.
మిథునం, వృశ్చికం, మీనం, మకర రాశి వారికీ మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.
గ్రహణ సమయంలో చేయాల్సిన పూజా విధులు.. ఆయా వ్యక్తులు గ్రహణ సమయంలో నవగ్రహ స్త్రోత్రాలు, ఆదిత్య హృదయం, విష్ణు సహస్ర నామం, మహా మృత్యుంజయ మంత్రాలను జపించడం వలన గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. పితృ దేవతలకు తర్పణం, పేదలకు వస్త్ర దానం, ఆవులకు గో గ్రాసం, పేదలకు అన్నదానం వంటివి చేయడం వలన గ్రహ దోషాలతో పాటు గ్రహణ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.
Disclaimer (గమనిక): ఇవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం, గ్రహ గోచారం ఆధారంగా వివిధ వ్యక్తులకు వేర్వేరుగా ఉండబోతుంది. జన్మకుండలి, దశా భుక్తులు, గోచారాలు, గ్రహణ నక్షత్ర సంబంధాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ వార్త సరైదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. పండితులు, ఇతర హిందూ సంప్రదాయ వాదులు చెప్పిన విషయాలనే మేము ప్రస్తావించాము. ఈ గ్రహణాన్ని నేరుగా కాకుండా.. బైనాక్యులర్, ఫిల్మ్ లేదా సౌర ఫిల్టర్ వంటి ద్వారా చూడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.