
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో చైనాను ఓడించి మరీ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం. ఇక ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 54 పతకాలు ఉన్నాయి. ఇందులో ఏడు స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. బుధవారం జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకా ప్రదీప్, చికిత తానిపర్తి లత