
తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సోమవారం రాత్రి 7-8 గంటల సమయంలో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడి పర్యవేక్షణలో ఈ క్రతువును నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 6.21 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుంది. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు మంగళవారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. కల్యాణవేదిక వద్ద ఫల, పుష్ప ప్రదర్శనశాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల కోసం ఫల, పుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు చేశామన్నారు. తిరుమలకు వచ్చే వారంతా ఈ ప్రదర్శనశాలను తిలకించాలని కోరారు. శిశుపాల వధ ఘట్టాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారు. భిన్న రూపాల్లో తీర్చిదిద్దిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ ఫొటోలు మీ కోసం..




