వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై మెజారిటీ వర్గాల మద్ధతు సంపూర్ణంగా ఉందనే భావనలో మార్పొచ్చింది. కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిర్భయంగా ఎండగడుతోంది. దీంతో నవతరం ఆలోచనలో పడింది. దేశ రాజకీయాలను పరిశీలిస్తున్న యువతరానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యేక వారధిగా నిలిచింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై ఆందోళనలు, నిరసనలతో యువతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తప్పుబడుతూ రోడ్డెక్కారు.
దేశ భవిష్యత్తుకు ఆశాజనకమైన యువతరం ఆగమైపోతోందని ప్రభుత్వాలను నిందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆలోచనలను పంచుకున్నారు. స్నేహ సంబంధాలను పెంచుకున్నారు. కాక్రోచ్ జనతాపార్టీ పిలుపుతో దేశ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుంటున్న యువత ఢిల్లీ జంతర్ మంతర్ లో సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా పట్టువీడలేదు. దేశంలో విద్యార్థుల ఆందోళనలు పెరిగి… ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కేంద్రం దిగొచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఎన్నికలు ఎపుడు వచ్చినా… యువతరం ఓటర్ల మద్ధతుగా నిలిస్తే అధికారానికి తిరుగులేని శక్తిగా అవతరించవచ్చని రాజకీయ పార్టీల భావన. ఎన్నికలకు ముందుగా యువ ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ పక్షాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోవనే విమర్శలున్నాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కారం మాట దేవుడెరుగు.. కనీసం వినిపించుకునే నాథుడే లేడని యువత ఆవేదన వ్యక్తంచేస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలు దేశ రాజకీయాల్లో కదిలిక సంచలనానికి దారితీసింది. కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విజయోత్సవాలను చేసుకున్నారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. బొద్ధింకల పార్టీకి రాజకీయాలు, అధికారం అవసరంలేదు… యువత ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి పోరాటం చేస్తామన్న ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
ఆర్ఎస్ఎస్ ఛీఫ్ దిద్దుబాటు చర్యలు.. అధికారంపై ఆకాంక్ష లేకుండా… యువతరం బాగోగులే లక్ష్యంగా ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్న ప్రకటనతో అధికార పార్టీలో అలజడి… విపక్షాల్లో ఆనందోత్సాహం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో దేశంలో రాజకీయాల్లో మార్పు వస్తుందనే భావనతో సంఘ్ రంగంలోకి దిగింది. భారతీయ జనతాపార్టీకి యువత ద్వారా జరిగే నష్టాన్ని నివారించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
యువత లేవనెత్తిన ఆందోళనలు, సమస్యలు నిజమైనవని.. దేశరాజకీయాలను తీక్షణంగా పరిశీలిస్తూ ప్రభుత్వేతర శక్తిగా ఉన్న రాష్ట్రీయ సేవక్ సంఘ్ చీఫ్ యువతర మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముంబై వేదికగా నిర్వహించిన సదస్సులో యువతరం మనోగతనాన్ని స్వయంగా తెలుసుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్-జీ ఆకాంక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువత లేవనెత్తిన ఆందోళనలు, సమస్యలు నిజమైనవని, వారి నిజాయతీని తాను పూర్తిగా విశ్వసిస్తానని ఆయన స్పష్టం చేశారు. నిరసన తెలిపే హక్కు వారికి ఉందని, వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయకూడదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్ జీకి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.
యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి.. యువతరం… ఉడుకు రక్తంతో రగిలిపోతే… దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతొందని అంచనా వేసిన మోహన్ భగవత్.. యువతరం ఉజ్వల భవిష్యత్తుకు పాలకులు పాటుపడాలని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. సదస్సుల్లో మోహన్ భగవత్ తో విద్యార్థులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వాలపై యువతకు కోపం కాదు... ద్వేషం అసలే లేదు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి భవిష్యత్తు తరాల మన వేదనకు ప్రతిరూపమనే భావన అనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యువతరాన్ని సముదాయించారు. విద్యార్థుల పోరాటాలను అర్థం చేసుకుని వారిని పాలకులు గౌరవించాలని సూచించారు. విద్యార్థుల పోరాటాన్ని, సోషల్ మీడియా ప్రచారంపై వాస్తవాలను గుర్తించాలని హితబోధ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసే సమాచారంలో వాస్తవాలను తెలుసుకోవాలనే ప్రాథమిక బాధ్యతను గుర్తుచేశారు. సోషల్ మీడియా ప్రచారంతో సెన్సేషన్… ప్రజానీకాన్ని పరేషాన్ చేయవద్దనే స్పృహను విద్యార్థులు గుర్తించాలనే బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.
సోషల్ మీడియాతో ఎలాంటి ప్రమాదం లేదు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు విద్యార్థుల పోరాటాలు చేయాలని, విద్యార్థులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టవద్దని మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తంచేశారు. విద్యార్థులు ఉద్యమించాలనుకున్నపుడు, యువత ఆకాంక్షలను తెలుసుకోడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం సంప్రదింపులు జరిపితే.. ఉద్యమాలతో ఉద్రిక్త పరిస్థితులు ఉండవని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే సమాచారమంతా వాస్తవం కాదని తెలుసుకునే దాకా యువతరం సంయమనం పాటించాలన్నారు. ప్రతి విషయంపై సమాజం అవగాహనతో వ్యవహరిస్తే సోషల్ మీడియాతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో దేశానికి ప్రయోజనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతున్న యువతకు మోహన్ భగవత్ అండగా నిలవడంతో రాజకీయ పార్టీలు ఖంగు తిన్నాయి. జెన్ జీ.. ఆలోచనతో వ్యవహరిస్తే సమాజంలో అద్భుతాలను సృష్టించవచ్చనే మోహన్ భగవత్ హితబోధ విద్యార్థులను ఆలోచనలో పడేసింది. యువత తమ ప్రయోజనాలకోసం పోరాటంచేస్తూ.. దేశ ప్రయోజనాలను కాపాడలనే సందేశంతో విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించారు. దేశంలో అల్లకల్లోల పరిస్థితులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగి సమాజానికే నష్టమనే భావన యువతలో కలిగించారు. సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో దేశానికి కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తుకు ఊతమిస్తాయని గుర్తించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై యువత వ్యతిరేకత... దేశానికే నష్టదాయకమనే సంకేతం.. ప్రభుత్వ పాలనా తీరును ఎండగడుతూ, ప్రజాసమస్యలపైనే పోరాడుతామన్న కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలను సమర్థిస్తూనే.. భవిష్యత్తుపై విద్యార్థులు ఫోకస్ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా వ్యతిరేకత పెంచుకోకుండా.. భవిష్యత్తు అవసరాలను సామరస్యంగా పరిష్కరించుకునే మార్గాలను అన్వేషించాలని మోహన్ భగవత్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై యువత వ్యతిరేకత... దేశానికే నష్టదాయకమనే సంకేతాలిచ్చారు. మోహన్ భగవత్ దౌత్యంతో విద్యార్థుల ఆలోచనాతీరును మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.