Ardee Industries Listing Price : స్టాక్ మార్కెట్లలో మరో ఐపీఓ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. అదే అర్డీ ఇండస్ట్రీస్. బుధవారం రోజు ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయింది. ఇష్యూ ధర కేవలం రూ. 53 గా ఉండగా ఏకంగా 35.85 శాతం ప్రీమియంతో రూ. 72 వద్ద NSE లో లిస్టయింది. ఇది గ్రే మార్కెట్ ప్రీమియాన్ని మించింది. గ్రే మార్కెట్లో దాదాపు 27 శాతం వరకు ప్రీమియం నమోదు చేస్తుందని రాగా, అంతకుమించి రాణించడం విశేషం. దీంతో ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా షేర్లు దక్కిన ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది.ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్ట్ 5న ఓపెన్ అవగా ఆగస్ట్ 7 వరకు సాగింది. ఆగస్ట్ 10న షేర్ల అలాట్మెంట్ జరగ్గా, ఆగస్ట్ 11న డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు ఆగస్ట్ 12న స్టాక్ మార్కెట్లో నమోదైంది. సబ్‌స్క్రిప్షన్‌లో దీనిని ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పలు చిన్న ఐపీఓల్లో అద్విత్ జువెల్స్, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్, కుసుమ్‌గార్ లిమిటెడ్ ఇలా ఇవన్నీ 100 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఇవి తొలిరోజునే కనీసం 40 శాతం వరకు లాభాల్ని అందించాయి.ఇదే బాటలో అర్డీ ఇండస్ట్రీస్ ఐపీఓ కూడా ఏకంగా 133.66 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ నమోదు చేసింది. రిటైల్ పోర్షన్ నుంచి 45 రెట్ల స్పందన రాగా, అత్యధికంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) కేటగిరీ నుంచి 255.24 రెట్ల సబ్స్క్రిప్షన్ సాధించింది. క్యూఐబీ పోర్షన్ కూడా 197 రెట్లకుపైగా సబ్స్క్రిప్షన్ సాధించింది. మొత్తం రూ. 426 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు 8,03,52,358 షేర్లను అందుబాటులో ఉంచింది. ఇక్కడ 6.03 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయగా, దాదాపు 2 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయించారు.Read Also: ఎట్టకేలకు లలితా జువెల్లరీ ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ