
Apply Pay UPI : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు పండగే.. అతి త్వరలో భారతీయ ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఆపిల్ పే సర్వీసు రాబోతుంది. ఆపిల్ టెక్ దిగ్గజం పేమెంట్ సర్వీసును 2026 సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో భారత్‌లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ప్రారంభ దశలో ఆపిల్ పేకి యూపీఐ సపోర్ట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. భారతీయ యూజర్ల కోసం ఆపిల్ పే సర్వీసును ప్రధానంగా Visa, Mastercard నెట్‌వర్క్‌లపై జారీ చేసిన క్రెడిట్ కార్డుల కోసం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆపిల్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న క్రెడిట్ కార్డులను యూజర్లు ఆపిల్ వాలెట్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేయవచ్చు. ఆపిల్ పే సర్వీసు వస్తే.. : ప్రతి పేమెంట్ సమయంలో కార్డు నంబర్, CVV, OTP వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, టోకనైజేషన్ వంటి సేఫ్టీ బెనిఫిట్స్ ద్వారా పేమెంట్లు చేయవచ్చు. కార్డు వివరాలు బహిర్గతమయ్యే రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే, యూపీఐ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు. యూపీఐ పేమెంట్లను ఆపిల్ పేలో అందించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్పాన్సర్ బ్యాంక్ పార్టనర్ షిప్‌కూడా అవసరం. దీనికి సంబంధించిన ఫీజులపై ఆపిల్, భారతీయ బ్యాంకుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. Read Also : Jagtial Twins Adoption : తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం ఆపిల్ ఒక్కో లావాదేవీపై 15–20 బేసిస్ పాయింట్ల వరకు ఫీజు కోరుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు సుమారు 10 బేసిస్ పాయింట్లకు పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో UPI, QR పేమెంట్లకు ఆపిల్ పే సపోర్టు