
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించేందుకు 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పోస్టులను సాధారణంగా విద్యా వాలంటీర్ పోస్టులుగా పిలుస్తున్నారు. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. విద్యార్హతలు, అకడమిక్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 3,597 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్తో పాటు రెండేళ్ల డీఎడ్ (D.Ed) కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత టీచింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈడీ పూర్తి చేసి ఉండాలి. TET లేదా DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నియామకాలకు ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలు, అకడమిక్ మెరిట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు. అందువల్ల ఇప్పటికే TET, DSC వంటి అర్హతలు సాధించిన అభ్యర్థులకు ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ పరిధిలోని MEO కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వాటిని సంబంధిత ఉన్నతాధికారుల కార్యాలయాలకు పంపిస్తారు. అనంతరం అర్హతలు, మెరిట్ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు. DEO కార్యాలయానికి దరఖాస్తుల పంపకం: ఆగస్టు 22 ఎంపికైన వారికి