© 2026 nimisham.in

అక్టోబర్ నుండి రెండు డీఏలు

త్వరలోనే పీఆర్సీ కమిషన్ నియామకం

సంక్రాంతికి సరెండర్ లీవ్ పేమెంట్లు

AP Employees: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో 11 ఉద్యోగ సంఘాల నేతల సుదీర్ఘ సమావేశం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన సీఎం, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం APNGO అధ్యక్షుడు విద్యాసాగర్, APJAC అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలను, సీఎం ఇచ్చిన హామీలను వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు పిలవడంపై ఉద్యోగ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Kishan Reddy: భూములు అమ్ముకోడానికే 22A.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్

పీఆర్సీ నియామకం, డీఏల విడుదల.. ఉద్యోగులకు ఆర్థిక ఊరట:

ఈ భేటీలో ఉద్యోగుల(AP Employees) సుదీర్ఘకాల డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామని, అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంక్రాంతి కానుకగా ఒక సంవత్సరం సరెండర్ లీవ్ పేమెంట్లు విడుదల చేస్తామన్నారు. పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అదనపు సరెండర్ లీవ్‌ను మంజూరు చేసేందుకు అంగీకరించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డ్ నిధులను నేరుగా ట్రస్ట్‌లోకి జమ చేస్తామని వెల్లడించారు.

పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. ఐఆర్ పై త్వరలోనే నిర్ణయం:

70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి నుండి పునరుద్ధరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంపు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మధ్యంతర ఉపశమనం ప్రకటనకు కొంత సమయం కావాలని సీఎం కోరారని, ఈ చర్చల ఫలితాలపై రేపు ఉదయం భేటీ అయి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.