
జనసైనికులకు పవన్ కీలక ఆదేశాలు సోషల్ మీడియాలో భాషా సంస్కారం క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు Pawan Kalyan: సోషల్ మీడియా వేదికల్లో పార్టీ ప్రతిష్ఠను పెంచేలా వ్యవహరించాలే తప్ప, దిగజార్చేలా ప్రవర్తించవద్దని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మాట్లాడే భాష, పెట్టే పోస్టుల పట్ల పాటించాల్సిన నియమ నిబంధనలపై ఆయన సుదీర్ఘమైన స్పష్టతనిచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, సంస్కారం, సంయమనం వీడకూడదని, పార్టీ భావజాలానికి అద్దం పట్టేలా ప్రతి ఒక్కరి ప్రతిస్పందన ఉండాలని స్పష్టం చేశారు. TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. అవన్నీ ఫేక్.. జాగ్రత్త సుమీ! రాజకీయ సంస్కారం, గౌరవప్రదమైన వైఖరి: ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం వాడటం సమర్థనీయం కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా మహిళల పట్ల మాట్లాడేటప్పుడు అత్యున్నత గౌరవాన్ని ప్రదర్శించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెడుతూ, అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో చర్చకు పెట్టకూడదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన శైలిలో హెచ్చరించారు. ప్రత్యర్థుల కుట్రలను ఎదుర్కొనే వ్యూహం: రాజకీయ ప్రత్యర్థులు వేసే సోషల్ మీడియా వలలో చిక్కుకోవద్దని, విభేదాలు సృష్టించేందుకు జరిగే దుష్ప్రచారాలను జనసైనికులు చాకచక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త శ్రమను అధిష్టానం గురిస్తుందని భరోసా ఇచ్చారు. ఆధారాలు లేని విష ప్రచారాలపై ఆవేశపడకుండా, బాధ్యతాయుతమైన రీతిలో నిజాలను ప్రజలకు వివరించి కుట్రలను భగ్నం చేయాలని సూచించారు