గత కొంతకాలంగా సామాన్యుడిపై గుదిబండలా మారిన చికెన్ ధరలు దిగొచ్చాయి. గత నెలలో రూ. 300 వరకు చేరుకున్న కిలో చికెన్ ఇప్పుడిప్పుడే దిగొస్తోంది. చికెన్ ధరలతో పాటు కోడి గుడ్డు ధర కూడా తగ్గింది. సండే రోజు చికెన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకే రేటు ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉండే ధరే ఆంధ్రప్రదేశ్లోనూ ఉంటుంది. కాకపోతే ఒక పది రూపాయాల వ్యత్యాయం వరకూ ధరల్లో తేడా ఉండొచ్చు.హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో చికెన్ ధరలు సామాన్యుడికి సానుకూలంగానే ఉన్నాయి. హైదరాబాద్ జోన్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 240 ఉండగా, స్కిన్ చికెన్ రూ. 212 ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ. 137గా ఉంది, రైతు ధర రూ. 110 పలుకుతోంది. విజయవాడ జోన్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 250గా ఉంది. తెలంగాణ ప్రాంతంతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో ఒక పది రూపాయలు ఎక్కువగానే ఉంది.READ ALSO బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలువిజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 250 ఉండగా, డ్రస్సెడ్ చికెన్ రూ. 223గా ఉంది. ఇక ఫారమ్ దగ్గర లైవ్ బర్డ్ రూ. 117, రిటైల్ లైవ్ బర్డ్ రూ. 144 పలుకుతోంది. తెలంగాణలో బోనాల సందర్భంగా ఏపీకి చెందిన కోళ్లు కూడా అక్కడికే ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. గుంటూరులో కిలో చికెన్ రూ. 280.. కడప, మార్కాపురం జిల్లాల్లో రూ. 260 వరకూ ఉండటం విశేషం. ఇక హైదరాబాద్ జోన్లో 12 గుడ్ల రిటైల్ ధర రూ. 74గా ఉండగా.. విజయవాడ జోన్లో రూ. 80 ఉంది.ఇటీవల కాలంలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ. 10 వరకూ చేరుకోవడంతో మధ్యతరగతి వ్యక్తి ఇబ్బందిపడ్డాడు. అయితే చికెన్ ధరలతో పాటు ఇప్పుడు కోడిగుడ్డు ధర కూడా తగ్గింది. ఇప్పుడు ఒక్కో కోడి గుడ్డు ధర