
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శకుడు అనూప్ సత్యన్‌తో కలిసి ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. నిర్మాతలు బిను జార్జ్ అలెగ్జాండర్, ఆంటోని పెరుంబవూర్‌లో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దర్శకుడు అనూప్ మాట్లాడుతూ.. ‘తండ్రి సత్యన్ ఆంథికాడ్ చిత్రాల శైలికి పూర్తిగా ఇది భిన్నంగా ఉంటుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, భావోద్వేగాల వంటి అంశాలతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. మోహన్‌లాల్‌కు గత వారమే కథ వినిపించా.. ఆయనకు నచ్చడంతో సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద