
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్ (Asian Games 2026) సమీపిస్తోన్న వేళ భారత అథ్లెట్ అంకిత దయాని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. స్టంప్‌టౌన్ ట్విలైట్ వేదికగా 1500మీ రన్లో తన కెరీర్లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసింది. గతం కంటే ఐదు సెకన్ల ముందే రేస్‌ను పూర్తి చేయడం గమనార్హం. అయితే, స్టంప్‌టౌన్ ట్విలైట్ రేసులో రెండో స్థానం వరించింది. తన రేసును 4:06.75 నిమిషాల్లో పూర్తి చేసింది. అగ్రస్థానం సాధించిన కార్మెన్ అల్డెర్ (4:06.40) కంటే దయాని టైమింగ్ కాస్త మాత్రమే తక్కువ. భారత అథ్లెట్ ఇంత ఫాస్ట్‌గా రేసును ముగించడం ఇదే తొలిసారి. ఇక ఆమె కెరీర్ బెస్ట్ 4:12.28 నిమిషాలు. ఇంతకుముందు ఎప్పుడూ 4:10 నిమిషాల్లో రేసును ముగించని దయాని (Ankita Dhyani) బెస్ట్ రన్‌తో ఆశ్చర్యపరిచింది. దీంతో రాబోయే ఆసియా గేమ్స్‌లో 1500మీ, 3000 మీ స్టీపుల్‌చేజ్‌లో పతకాలు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ హవా సాగింది