
Anirudh Ravichander-Kavya Maran : కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. వీరిద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని ప్రచారం సాగుతోంది. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని సదరు వార్త సారాంశం. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అటు కావ్య లేదా ఇటు అనిరుధ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. Jyoti Poorvaj : పింక్ శారీలో సీరియల్ నటి అందాలు చూడతరమా.. దివి నుంచి దిగివచ్చిన దేవకన్య! కాగా.. గతంలో కూడా వీరి రిలేషన్షిప్ గురించి ఎన్నోసార్లు వార్తలు పుట్టుకొచ్చినా ఇద్దరూ ఎన్నడూ పెదవి విప్పలేదు. అయితే.. అనిరుద్‌కు బంధువైన నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే అనిరుధ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని స్పష్టం చేశారు. అయినప్పటికి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో వధువు కావ్య మారనే అని ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ జైలర్ 2, షారుఖ్ ఖాన్ కింగ్ వంటి ప్రాజెక్టులతో పాటు మరిన్ని సినిమాలకు సంగీతాన్ని అందించనున్నారు. మరోవైపు కావ్య మారన్ వ్యాపార రంగంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తోంది. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తెగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సీఈఓగా ఆమె చాలా క్రేజ్ సంపాదించుకుంది