
కొన్ని సినిమాల్ని ఎన్నేళ్లయినా మరిచిపోరు జనం. సీక్వెల్ లేట్ అయినా దాని క్రేజ్ దానికి అలానే ఉంటుంది. ప్రేక్షకులు మరిచిపోయారంటూ వచ్చే కథనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) చెబుతున్న సంగతులివి. ‘యానిమల్ పార్క్’ (Animal Park) సినిమాను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు అంటున్నాడు.సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అదే టైమ్ లో దీనికి సీక్వెల్ కూడా ఎనౌన్స్ చేశారు. కానీ అనుకున్న టైమ్ కంటే ఆలస్యమైంది సీక్వెల్. ఇంకా చెప్పాలంటే ‘యానిమల్ పార్క్’ ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు. ఓవైపు సందీప్ రెడ్డి వంగాపై బాలీవుడ్ లో ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. ఈ సినిమాపై బజ్ పూర్తిగా పోయిందని, ఇక ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదంటూ అక్కడ స్టోరీలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ప్రణయ్ రెడ్డి.. ‘యానిమల్ పార్క్’ ఎప్పుడొచ్చినా హిట్ పక్కా అంటున్నాడు. ఆ సినిమాకు బజ్ రావడానికి ఒక్క పోస్టర్, ఒక్క టీజర్, ఒక్క ట్రయిలర్ చాలంటున్నాడు. ఈ మాటలు అంటోంది తను కాదని, స్వయంగా సందీప్ తనతో ఈ మాట అన్నాడని చెబుతున్నాడు
.