ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవలు అందించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏకంగా 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా సిద్ధమైన 300 వాహనాలు విజయవాడ నుంచి అన్ని జిల్లాలకు పంపించారు.ఈ తల్లిబిడ్డ వాహనాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అత్యవసర సమయంలో వెంటనే సహాయం అందేలా ఎమర్జెన్సీ బటన్, అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకునే రక్షణ చర్యలు, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ వాహనాలను పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల రవాణా కోసం'తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్' (102)ను తీసుకొచ్చింది. ఏటా దాదాపు 2.75 లక్షల మందికి ఉచిత రవాణా సేవలు అందించనున్నారు. ఈ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం తర్వాత తల్లులను, శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు తీసుకెళతారు. అంతేకాదు గర్భిణీ మహిళలకు అవసరమైనప్పుడు ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఈ సర్వీసు పూర్తిగా ఉచితం, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదు. ఈ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కోసం గర్భిణులు లేదా బాలింతలు 102 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయొచ్చు.ఈ వాహనాల్లో తల్లిబిడ్డలకు ఎటువంటి అలసట, అసౌకర్యం కలగకుండా ఏసీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ వాహనంలోని వెనుక సీట్లలో కూర్చునే బాలింతల భద్రత కోసం ప్రత్యేక సీట్ బెల్టులను ఏర్పాటు చేశారు. ప్రసవం తర్వాత బాలింతలు సులభంగా వాహనం ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెసక్ వాహనాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి వాహనానికి జీపీఎస్ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు