
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లోనూ చెదురు మదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం పండగ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారు. భిన్న రూపాల్లో తీర్చిదిద్దిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ ఫొటోలు మీ కోసం..





