
మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అయ్యన్నపాత్రుడు, ప్రసన్నకుమార్‌ సూర్యదేవర ఈనాడు, అమరావతి: దక్షిణాఫ్రికాలోని చారిత్రక పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌ను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అక్కడ గాంధీజీని రైలు బోగీ నుంచి గెంటివేసిన స్టేషన్‌ ప్లాట్‌ఫాంను, మహాత్ముని స్మారక కేంద్రాన్ని, ఆయన గడిపిన వెయిటింగ్‌ రూంను, ఫొటో గ్యాలరీని సందర్శించారు. గాంధీజీ స్మృతులను నెమరువేసుకున్నారు. ‘జాతి వివక్ష, వలసవాద అణచివేతపై ప్రపంచవ్యాప్త ఉద్యమానికి దారితీసిన ప్రదేశం ఇది. ఈ ఘటన సత్యం, సమానత్వం కోసం గాంధీజీ పోరాటాన్ని అజరామర ఉద్యమంగా మార్చింది’ అని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడి వెంట శాసనసభ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవర ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





