
Anchor Charmilla Bigg Boss 10 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాలిటీ షో 'బిగ్ బాస్' మరో కొత్త సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. ఇప్పుడు మైలురాయిగా నిలిచే 'బిగ్ బాస్ సీజన్ 10' (దశావతారం) పేరుతో మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తుండటంతో షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సీరియల్ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, హీరో అబ్బాస్ వంటి పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో క్రేజీ బ్యూటీ పేరు వచ్చి చేరింది. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తన క్యూట్ యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ఆర్జే చర్మిల పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ స్టేజ్‌పై ఆమె ప్రతిభను చూసి ముచ్చటపడ్డ అల్లు అరవింద్ స్వయంగా ఆమెకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ రెడ్ ఎఫ్ఎమ్ ఆర్జేగా కెరీర్ ప్రారంభించిన చర్మిల నల్లూరి.. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖ యాంకర్‌గా దూసుకుపోతున్నారు. తనదైన శైలి మాటతీరు, అందంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ సోషల్ మీడియా సెన్సేషన్ బిగ్ బాస్ సీజన్ 10లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ క్యూట్ యాంకరమ్మ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది