
అమ్మ ఆత్మీయ స్పర్శతో అబ్బురంగా లోకాన్ని చూడాల్సిన పసికందు కరకు ముళ్ల పొదల్లో కళ్లు తెరచింది నాన్న మోమున వెలుగై.. ఆయన గుండె చప్పుడై నవ్వాల్సిన పసిగుడ్డు కరకు హృదయాల ఘాతాలతో రక్తాన్ని కార్చింది.. లోకం చూడక ముందే.. దాని దుర్మార్గ పోకడకు బలై.. చిగురుటాకై తల్లడిల్లిపోయింది.. వరలక్ష్మి వ్రతం నాడే.. ఓ చిన్ని మహాలక్ష్మి.. అనాథన్న పేరుతో.. ఓ ప్రశ్నగా మిగిలింది ఆత్మకూరు మండలం పంపనూరు నగరవనం ఎదుట ముళ్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేసి పోగా- అటుగా వెళ్లిన గొర్రల కాపరులు చిన్నారి ఏడుపును విని అతి కష్టం మీద బయటకు తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత శిశు సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ తెలిపారు. చిన్నారిని ఎవరు పడేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.