
కదిరి పట్టణం: కదిరి మండలం బత్తలపల్లి వద్ద ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమజంట విద్యుదాఘాతంతో గాయపడ్డారు. ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఫయాజ్, నల్లమాడ మండలానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం కదిరికి వెళ్తున్నట్లు చెప్పి యువతిని తీసుకొని బత్తలపల్లికి వెళ్లారు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కదిరి గ్రామీణ పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన యువకుడిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఫయాజ్‌కు వివాహమై భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.