
అనంతపురం: పంటపొలంలోకి వచ్చిన జింకలను చిరుత పులులు వేటాడి చంపిన ఘటన అనంతపురం జిల్లా తాటిచెర్లలో చోటుచేసుకుంది. స్థానిక రైతు నరసింహారెడ్డి టమాట పంటకు రక్షణగా పొలం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. టమాటలను తినేందుకు ఏడు జింకలు పొలంలోకి వెళ్లాయి. గమనించిన రెండు చిరుతలు వాటిని వేటాడాయి. ఫెన్సింగ్‌ ఉండటంతో జింకలు తప్పించుకోలేక చిరుతలకు చిక్కాయి. మృగాల సంచారంతో తాటిచెర్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





