ప్రమోట్ చేయడం, రానా సంస్థ ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.
అమీర్ లోగ్ సినిమా కథ చాలా పాతదే. ఓ ముగ్గురు ఖాళీగా తిరిగే కుర్రాళ్ళు, వాళ్ళని బాగుపడమని చెప్పే ఇంట్లో వాళ్ళు, వాళ్లకు సపోర్ట్ చేసే మనుషులు, వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడం.. ఇదే కథ, కథాంశం. గతంలో చాలా సినిమాల్లో చూసేసాం. గతంలో కేవలం హైదరాబాదీ, ఓల్డ్ సిటీ సినిమాలు కొన్ని వచ్చేవి. ఎక్కువగా ఉర్దూ, అక్కడక్కడా తెలుగు మాట్లాడుతూ, హైదరాబాద్ బస్తీల్లో, లోకల్ మనుషులతోనే తీసే సినిమాలు కొన్నేళ్ల క్రితం అడపాదడపా వచ్చేవి. ఈ అమీర్ లోగ్ సినిమా అచ్చం అలాంటి సినిమానే.
ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు తిరగడంతోనే ఒక అరగంట రొటీన్ సీన్స్ తో సాగదీశారు. ముగ్గురు లైఫ్ లో సెటిల్ అవుదాం అనే దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఆఫీస్ టీమ్ వర్సెస్ బస్తి క్రికెట్ మ్యాచ్ తో ఎవరు గెలుస్తారు? నెక్స్ట్ ఏమవుతుంది అనే బ్యాంగ్ తో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి అయితే పెంచారు. ఇక సెకండ్ హాఫ్ లో క్రికెట్ అయిపోయి బిర్యానీ చుట్టూ కథ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో అధికారికంగా ప్రకటించకపోయినా పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు.
సినిమాకు పెద్ద మైనస్ భాష. ఇది కేవలం హైదరాబాద్ ఓల్డ్ సిటీ సినిమా అని ప్రచారం చేస్తే ఎవరూ పెద్దగా ఊహించరు. కానీ అందరికి కనెక్ట్ అవుతుంది అని, తెలుగు సినిమానే అని ప్రమోట్ చేసారు. ఈ సినిమాలో తెలుగు కంటే హిందీ, ఉర్దూ డైలాగ్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. కొన్ని పాత్రలు తెలుగులో మాట్లాడే వాళ్ళచేత కూడా హిందీ డైలాగ్స్ ఎందుకు చెప్పించారో, తెలుగులో మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు హిందీలో మాట్లాడటం ఏంటో దర్శకుడికే తెలియాలి. హిందీ రాకపోతే ఈ సినిమాలో సగం పైగా డైలాగ్స్ అర్ధం కావు. కనీసం సబ్ టైటిల్స్ కూడా వేయలేదు. పక్కా ఓల్డ్ సిటీ హైదరాబాద్ సినిమా. అలాంటి సినిమాలు చూసేవాళ్ళు అయితే చూడొచ్చు. ఇక టైటిల్ అమీర్ లోగ్ అంటే ధనవంతులైన ప్రజలు. టైటిల్ కి ఓ సీన్ తో బాగానే జస్టిఫికేషన్ ఇచ్చారు.
సినిమా మెయిన్ లీడ్ ముగ్గురు కుర్రాళ్ళు హరి, మనోజ్, శశిధర్.. కొత్తవాళ్ళైనా బాగా నటించారు. వేద జలంధర్ తిమ్మరాజు పల్లి టీవీలో హీరోయిన్ గా అందర్నీ మెప్పించి సడెన్ గా ఈ సినిమాలో హీరోలకు అక్క పాత్రలో చేయడంతో షాక్ అవుతాము. ఆమె పాత్రలో అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపించింది. అసలు అంత మంచి హీరోయిన్ ఇలా అక్క పాత్ర చేయడం ఏంటో అనిపిస్తుంది. చాచా పాత్రలో విశ్వేందర్ మంచి ఎమోషన్ పండించారు. రావణ్ నిట్టూరు, సాయియోగి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. చాలావరకు లోకల్ ఆర్టిస్టులను, కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. క్రికెట్ లో మాత్రం కొన్ని సినిమాటిక్ షాట్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్ కలర్ గ్రేడింగ్ చేయలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ లో చాలా ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బెటర్. పాత కథే అయినా హైదరాబాద్ బస్తి బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ప్రయత్నించాడు దర్శకుడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం చాలా బాగున్నాయి. భాష అర్ధం కాకపోయినా అన్ని పాటలు రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టునట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘అమీర్ లోగ్’ ఓ ముగ్గురు హైదరాబాదీ బస్తి కుర్రాళ్ళ కథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.