© 2026 nimisham.in
గ్రీన్ టీ తాగితే ఇన్సులిన్ లెవెల్స్ మెరుగుపడతాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. అందుకే రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే టైప్ 1 డయాబెటిస్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. గ్రీన్ టీ రెగ్యులర్గా తాగితే మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. తద్వారా శరీరంలోని కొవ్వు తొందరగా కరిగి బరువు అదుపులో ఉంటుంది. అలాగే పొట్ట తగ్గాలని చూసేవారు కూడా గ్రీన్ టీ తాగడం మంచిది. గ్రీన్ టీలో కొద్దిగా కెఫిన్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఏకాగ్రత, మూడ్ మెరుగుపర్చడంలో సహాయపడతాయి. అందుకే రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మ కణాలను హెల్తీగా ఉంచుతాయి. తద్వారా వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు. రోజూ గ్రీన్ టీ తాగితే రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. అందుకే గుండె సంబంధ సమస్యలు తగ్గాలంటే ఈ గ్రీన్ టీ తాగడం మేలు. గ్రీన్ టీలోని పాలిఫినాల్స్ శరీరంలో ఇంఫ్లమేషన్తో పోరాడి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. గ్రీన్ టీలోని పోషకాలు ఎముకల బలం పెంచడంలో సహాయపడతాయి. తద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గ్రీన్ టీలోని కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు నోటిలో దుర్వాసనకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. తద్వారా నోరు ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలు కూడా హెల్తీగా, బలంగా ఉంటాయి. గ్రీన్ టీలోని పోషకాలు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు రాకుండా కాపాడుతాయి. అందుకే మెంటల్ హెల్త్ కోసం రోజూ గ్రీన్ టీ తాగడం మంచిది
.