
సైబర్ టాస్క్ కనిపిస్తే జాగ్రత్త పడండి మోసపోయే జనాలకు జంతువుల చురకలు సైబర్ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తున్న జంతువులు విజయవాడ నేరవార్తలు, న్యూస్టుడే: ‘పార్ట్ టైం ఉద్యోగం పేరుతో రూ.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి.’, ‘పెట్టుబడుల పేరుతో విశ్రాంత రైల్వే ఉద్యోగికి రూ.20 లక్షలకు టోకరా’.. కొన్నేళ్లుగా వెలుగు చూస్తున్న సైబర్ నేరాల తీరిదీ. ఆ తరహా నేరాలపై పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, దినపత్రికల్లో జాగ్రత్తలు చెప్పినా... సైబర్ నేరగాళ్ల చేతుల్లో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు సైతం ఈ తరహా మోసాలకు గురవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఖాకీ స్టూడియో ఓ సరికొత్త వీడియో రూపొందించింది. పక్షులు, జంతువులను మాట్లాడిస్తూ.. రూపొందించిన ఆ వీడియోలో మోసపోతున్న జనాలకు చురకలు అంటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.