
గ్రాముల్లో తేడాలతో జనాన్ని ముంచేస్తున్నారు బియ్యం, కూరలు, మాంసం విక్రయాల్లో మోసాలు ‘న్యూస్‌టుడే’ బృందం ప్రత్యక్ష పరిశీలనలో వెల్లడి 235 గ్రాముల ఫోన్.. బియ్యం కొట్లో 240 గ్రాములు చూపిస్తూ.. న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్,పెడన, గుడివాడ, అవనిగడ్డ, కూచిపూడి, ఉయ్యూరుగ్రామీణ, హనుమాన్‌జంక్షన్ : వినియోగదారుడే రాజు.. ఏ దుకాణానికి వెళ్లినా ఈ స్టిక్కర్లు కనిపిస్తాయి. వ్యాపారులకు కొనుగోలుదారులు ఎంత ముఖ్యమో చెప్పే నినాదమిది. కానీ వ్యాపారమేదైనా వీలుదొరికితే జనాలను కొలతల్లో బోల్తా కొట్టించేస్తున్నారు. రైతుబజార్లు మొదలు కిరాణా దుకాణాలు, చేపలు, మాంసం మార్కెట్లలో నిలువునా మోసగిస్తున్నారు. కిలో మోడ్‌ను లీటర్లలో మార్చి కొనుగోలుదారుడిని ఏమారుస్తున్నారు. ఇలా 130 నుంచి 150 గ్రాముల వరకు కొట్టేస్తున్నారు. కార్డుదారులను కొందరు డీలర్లు మోసగిస్తుంటే..డీలర్లను ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర తరుగుతో దోచేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖలో అధికారులు, సిబ్బంది కొరతతో తనిఖీలు నామామాత్రంగా జరగడమే దీనికి కారణం. తూకాల్లో మోసాలపై ‘న్యూస్‌టుడే’ బృందం గురవారం ప్రత్యక్షంగా పరిశీలించి అందిస్తున్న కథనమిది. గుడివాడ పట్టణంలోని కొన్ని కిరాణా దుకాణాలు, బియ్యం దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాల్లో మైనస్ 10 నుంచి 20 గ్రాములు సెట్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ప్రతి కేజీకి ఆ మేరకు నష్టపోతున్నారు. వందల మంది వినియోగదారులను ఇదే విధంగా దోచేస్తున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యని చెబుతున్నారు. ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి తన సెల్‌ఫోన్ బరువును పరిశీలించగా 235 గ్రాములు వచ్చింది. గుడివాడ రైతుబజారులోని ఓ బియ్యం దుకాణం కాటాలో అదే సెల్‌ఫోన్‌ను ఉంచగా 240 గ్రాములు చూపింది. ఈ లెక్కన కిలోకు 20 గ్రాముల వరకు మైనస్ పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. గన్నవరం పరిధిలోని ఓ రేషన్ డీలరుకు 50 కిలోలకు గాను 47 కిలోలతో వచ్చిన బియ్యం బస్తా ఇది. జిల్లాలో ప్రతినెలా చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేస్తారు. డీలర్లు సంబంధిత