
మచిలీపట్నం నేరవార్తలు: మచిలీపట్నంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగినపూడి బీచ్‌లో 63 అడుగుల మట్టి గణపతి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణకు సాగర తీరంలో ఏర్పాటుచేసిన మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. 11 రోజులపాటు సాగర తీరంలో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో మంగినపూడి బీచ్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మంగినపూడి బీచ్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే మసులా బీచ్ పెస్టివల్తో ప్రపంచ వ్యాప్తంగా మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.