
‘ఆన్లైన్ షాపింగ్ టాస్క్ జాబ్’పై తొలి యుద్ధం విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే వివిధ రకాల మోసాలపై ఖాకీ స్టూడియో ద్వారా వినూత్నమైన వీడియోలు రూపొందిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తాజాగా ‘టాస్క్ ఆధారిత సైబర్ నేరాలు’పై యుద్ధం ప్రకటించారు. ఖాకీ బాబు, సైబర్ చిట్టి పాత్రలతో అవగాహన కలిగిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త పాత్రలను తెరపైకి తెచ్చారు. ప్రతి విషయాన్ని సులువుగా నమ్మేసి మోసపోయే ‘ట్రస్ట్ టిల్లు’ పాత్రతో పాటు ఆకర్షణీయమైన మాటలతో బురిడీ కొట్టించే ‘మాయా శేఖర్’ను పరిచయం చేశారు. టాస్క్ చేస్తే ఆదాయం అని.. ఆన్లైన్లో వచ్చిన ప్రకటన చూసి ట్రస్ట్ టిల్లు ఆకర్షితుడవుతాడు. పెట్టుబడి పెట్టి రూ.650లు కమీషన్ పొందుతాడు. తర్వాత రూ.5వేలు పెట్టుబడి పెడితే.. కమీషన్‌తో కలిపి అది రూ.7,500 అవుతుంది. తన వాలెట్లో డబ్బులు కనిపిస్తుండడంతో మురిసిపోతుంటాడు. విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ రావు. ‘మాయా మోహన్’ లైనులోకి వచ్చి.. మీ వీఐపీ టాస్క్ పూర్తి కాలేదని, మరో రూ.15వేలు పెట్టుబడి పెడితే మొత్తంగా ఒకేసారి రూ.25వేలు విత్‌డ్రా చేసుకోవచ్చని నమ్మిస్తాడు. అతను చెప్పినట్లు రూ.15వేలు పెట్టుబడి పెట్టినా.. విత్‌డ్రా కుదరదు. అదేమంటే మరో రూ.20వేలు వెరిఫికేషన్ ఫీజు చెల్లించాలని చెబుతాడు. విసిగిపోయి.. నా డబ్బులు వెనక్కి ఇవ్వమని అడిగితే.. ‘మాయా మోహన్’ చరవాణి పనిచేయదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు