
పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో మోసాలు టాస్క్ ఆధారిత సైబర్ నేరాలపై ‘యుద్ధం’ విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే ... ఇటీవల ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాల తీరిది. లైక్ కొడితే డబ్బులిస్తామంటూ ముగ్గులోకి దింపుతారు. రకరకాల ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేస్తారు. ఈ ‘టాస్క్ ఆధారిత సైబర్ నేరాలు’ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హెచ్చరిస్తున్నారు. అమాయక ప్రజలను చైతన్యవంతం చేసేలా వీటిపై వారం రోజుల పాటు ‘యుద్ధం’ ప్రకటించారు. ఈ వారం రోజులు ప్రజల్లో అవగాహన కలిగిస్తారు. సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారు? రివ్యూ/ రేటింగ్, లైక్/ సబ్ స్క్రైబ్, డేటా ఎంట్రీ, పార్ట్‌టైం ఉద్యోగం... తరహా మోసాలపై పూర్తిస్థాయిలో వివరిస్తారు. ప్రజలెవరూ వీటికి గురికాకుండా విస్తృత ప్రచారం చేస్తారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో 2025-26లో ఇప్పటి వరకు 160 టాస్క్ ఆధారిత మోసాలు జరిగాయి. బాధితులు రూ.2.5 కోట్లు పోగొట్టుకున్నారు. రోజుకు రూ.వేలల్లో.. అంటే మోసమే - ఎస్.వి.రాజశేఖరబాబు, పోలీస్ కమిషనర్ సులభమైన టాస్క్‌లు పూర్తి చేసి రోజుకు రూ.వేలల్లో సంపాదించండి అని మేసేజ్ వస్తే అది సైబర్ మోసమే. ముందుగా డబ్బులు ఇచ్చి.. ఆ తర్వాత వివిధ రుసుములు పేరిట వసూలు చేసి మోసం చేస్తారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం, డిజిటల్ అరెస్ట్ వంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు లేక ‘్వ్జ’౯‘౯i్ఝ’.్ణ్న్ర.i- లో ఫిర్యాదు చేయండి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.