
భారీగా ఆస్తులు కొన్న నిందితులు మాషాఅల్లా ఎంటర్ప్రైజెస్ కేసులో ఎన్నో కోణాలు ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, సత్యనారాయణపురం (గాంధీనగర్) బోర్డు తిప్పేసేలోపే వీలైనంత మేర డిపాజిట్లు వసూలు చేసేందుకు నిందితులు చాలా ఎత్తులు వేశారు. జులైలో అనూహ్యంగా డిపాజిట్లు పెరిగాయి. యంత్రాలపై తగ్గింపు పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేశారు. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మోసం వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ కోసం అనేక ఆఫర్లు ప్రకటించారు. ప్రధాన నిందితుడు అంకుశం, అతని భార్య సుమతో పాటు రమేష్‌రెడ్డి, పవన్‌రెడ్డి, జయరామ్‌రెడ్డి ఇందులో కీలకపాత్ర పోషించారు. స్క్రబ్బర్లను ప్యాకింగ్ చేసేందుకు మెటీరియల్‌ను నెలకు ఒకసారే ఇచ్చేవారు. మళ్లీ కావాలంటే తిరిగి డిపాజిట్ చెల్లించాల్సిందే. గోదాములో స్క్రబ్బర్ల సరకు పేరుకుపోవడం, బయట అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో కొత్త పథకాన్ని తెచ్చారు. డ్రైఫ్రూట్స్, మసాలా దినుసుల ప్యాకింగ్ పేరుతో వసూళ్లు ప్రారంభించారు. రూ.2లక్షల డిపాజిట్ చెల్లిస్తే రూ.30వేల విలువైన యంత్రాన్ని 50శాతం డిస్కౌంట్‌తో రూ.15వేలకే ఇస్తామని ప్రకటించారు. కానీ ఒప్పంద పత్రాలను మాత్రం ఇవ్వలేదు. స్టాంపు వెండర్లు సమ్మెలో ఉన్నారని చెబుతూ కాలయాపన చేసి చివరకు బోర్డు తిప్పేశారు. తెలంగాణ రాష్ట్రం, సొంత జిల్లా అయిన కడపలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కడపలో ఓ వాణిజ్య సముదాయం కూడా ఉన్నట్లు గుర్తించారు. కూకట్‌పల్లిలో ఇటీవల విల్లా కొనుగోలు చేసినట్లు తేలింది. ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారో పోలీసులు కూపీలాగుతున్నారు. బంధువులు, స్నేహితుల పేర్లతో భారీగా ఆస్తులు కొన్నట్లు సమాచారం. ఈ దిశగా సిట్ దర్యాప్తు చేస్తోంది. భూములు, బంగారంపై పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అంకుశం రాజా మొత్తం 10 సిమ్‌లు వాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆయా ఫోన్ల ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఏపీతో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు విజయవాడకు వస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,021 మంది వచ్చారు. వారి