
నందిగామ గ్రామీణం: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ భవనాన్ని బుధవారం కూటమి నేతలు, అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సైతం గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ ఇబ్బందులను తొలగించి వైద్య సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. వెల్నెస్ హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామాల్లోనే ప్రజలకు నిరంతరం ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతోపాటు ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు