
విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: రైలు ప్రయాణంలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన బంగారం వస్తువులను రైల్వే టీటీఈ సురక్షితంగా భద్రపరిచి తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. విజయవాడకు చెందిన టీటీఈ ఎ.కె.నాగసుధీర్ మంగళవారం రైలు నంబరు 18510 విశాఖపట్నం-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని బీ1 బోగీలో విధులు నిర్వహిస్తున్నారు. 58 బెర్తులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన బ్యాగు మర్చిపోయి ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగిపోయారు. బ్యాగును పరిశీలించగా అందులో రూ.10 లక్షల విలువైన బంగారం నగలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు ఆర్పీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. రైలు విజయవాడ చేరుకోగానే బ్యాగ్‌ను ఆర్పీఎఫ్ అధికారులకు అప్పగించారు. బ్యాగును సంబంధిత ప్రయాణికుడికి అందజేస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణికుడి విలువైన వస్తువులు చోరీ కాకుండా నిజాయతీగా అధికారులకు అప్పగించిన టీటీఈ నాగసుధీర్ను విజయవాడ సీనియర్ డీసీఎం ప్రశాంత్‌కుమార్ అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు