
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో మెగా డీఎస్సీ విజేతలు ర్యాలీ నిర్వహించారు. చినరావూరు పార్కు నుంచి గాంధీ చౌక్ వరకూ ఈ ప్రదర్శన కొనసాగింది. మెగా డీఎస్సీపై వైకాపా చేస్తున్న విమర్శలపై టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈర్యాలీ చేపట్టారు. తమ కష్టాన్ని అవమానించేలా వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు జరిగిందన్నారు. అతి తక్కువ సమయంలో ప్రభుత్వం డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.