
మల్కాజిగిరి, రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సాంకేతికలోపంతో ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్కాజిగిరి ఆర్పీఎఫ్‌ సీఐ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి, లాలాగూడ, సీ-క్యాబిన్‌ మార్గంలోని ఓహెచ్‌ (ఓవర్‌ హెడ్‌ ఇంజిన్‌) వైర్లలో విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు రావడంతో వైరు తెగిపడింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే ఇంటర్‌ సిటీ ట్రైన్‌ ఆలుగడ్డ బావి వద్ద నిలిచిపోయింది. దీంతో కొందరు ప్రయాణికులు అందులో నుంచి దిగి వెళ్లారు. ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లకు అంతరాయం కలిగింది. అర్ధరాత్రి దాటే సమయానికి సిబ్బంది ఓహెచ్‌ను సరిచేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనుల్లో ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.