.webp)
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఘటం ఊరేగింపు ను ప్రారంభించారు. అంత కుముందు ఆలయాన్ని సందర్శించిన సీపీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విశిష్ట చరిత్ర కలిగిన అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో పవిత్రమైన ఘటం ఊరేగిం పును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ప్లేగు వంటి ప్రాణాంతక వ్యాధులు, వరదల సమయంలో ప్రజలను కాపాడిన మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఘటం ఊరేగింపు జరిగే మార్గాల్లో భక్తులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా, అవాం ఛనీయ సంఘటనలకు తావులేకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వ యంతో విస్తృత బందో బస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. హరిబౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఘటం ఊరేగింపు గౌలిపురా, లాల్‌దర్వాజ, శాలిబండ మీదుగా సాగి నయాపూల్ వద్ద ముగి యనుంది. గత నెల రోజులుగా గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజ తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తుల సహకారంతో ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని సీపీ సజ్జనర్ తెలిపారు. బోనాల ఉత్స వాలను విజయవంతం చేసిన ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులకు హైదరాబాద్ నగర పోలీసుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ క్రైమ్స్ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, డీసీపీ టాస్క్‌ఫోర్స్ వైభవ్ గైక్వాడ్, ఐపీఎస్, డీసీపీ చార్మినార్ జోన్ ఖారే కిరణ్