© 2026 nimisham.in

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Lenin Review:పరిశ్రమలో మంచి అంచనాలు సొంతం చేసుకున్న అఖిల్ అక్కినేని కొత్త సినిమా 'లెనిన్' విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న తొలి స్పందనలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ సినిమాతో అఖిల్ బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి అఖిల్ చాలా జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై చిత్రబృందం కూడా భారీ నమ్మకం పెట్టుకుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. సినిమాకు సంబంధించిన తొలి సమాచారం ప్రకారం, 'లెనిన్'లో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. కథ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా సాగుతుందని, ముఖ్యంగా తొలి యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. సినిమాలో గ్రామీణ వాతావరణం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ సన్నివేశాలు మంచి కలయికగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ శ్రీరామపురం అనే కల్పిత గ్రామంలో జరుగుతుంది. గ్రామ ప్రజలకు అన్యాయం చేసే శక్తివంతమైన నాయకుడికి ఎదురు నిలిచే యువకుడి పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు. గ్రామోత్సవం నేపథ్యంలో జరిగే సంఘటనలు కథకు మరింత బలం చేకూరుస్తాయని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు
మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు సమాచారం. ఇక ట్విట్టర్ లో కూడా అప్పుడే కొంతమంది అక్కినేని అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.
సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె ఎంట్రీతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అలాగే సినిమాలోని భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను కదిలిస్తాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే ఇవన్నీ విడుదలకు ముందు వస్తున్న తొలి స్పందనలు మాత్రమే. అసలు సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల తీర్పు వచ్చిన తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం వస్తున్న సానుకూల ప్రచారం కారణంగా 'లెనిన్'పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా అఖిల్ కెరీర్లో కీలక మలుపుగా నిలిచి, ఆయనకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.