
దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) పేరు చెపితే చాలా మంది ఆయన సినిమాలు గుర్తుకు రాకపోవచ్చు. కానీ RX 100 డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుపడతారు. ఇప్పటివరకు ఈ దర్శకుడు నాలుగు చిత్రాలు తీశాడు. అయినా ఆ మొదటి చిత్రం RX 100 మాత్రమే పెద్ద హిట్ గా నిలిచింది ఆయన కెరీర్లో. రెండో చిత్రంగా ‘మహా సముద్రం’ తీశాడు. అది దారుణంగా పరాజయం పాలు అయింది. ఆ తర్వాత ‘మంగళవారం’ అనే చిత్రం తీశాడు. పాయల్ రాజ్ ఫుత్ (Payal Rajput)నటించింది. మొదటి సినిమా RX 100లో కూడా ఆమె హీరోయిన్. అందులోనూ, ఇందులోనూ పాయల్ చాలా బోల్డ్ గా నటించింది. ఇది ఫర్వాలేదు అనిపించుకొంది. ఇక నాలుగో చిత్రంగా ‘శ్రీనివాస మంగాపురం’ అని తీశారు. ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రష పరిచయం అయ్యారు. సినిమా ఢమాల్. దాంతో, ఆయన కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ గా ‘మంగళవారం 2’ (Mangalavaram 2) తీద్దామనుకుంటున్నాడట. అలా మళ్ళీ హాట్ హాట్ సీన్లతో కూడిన సినిమాలతోనే హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా పాయల్ రాజపుత్ హీరోయిన్ గా నటిస్తుందట
.