
ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటనలో పైలట్ గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సంస్థలో పనిచేస్తున్న పైలట్లందరికీ తప్పనిసరిగా సైకోయాక్టివ్ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాయి. ఈ ప్రక్రియ గురువారం (ఆగస్టు 13) నుంచే అమల్లోకి వచ్చిందని సంస్థలు స్పష్టం చేశాయి.ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లలో కలిపి మొత్తం 5,000 మందికి పైగా పైలట్లు పనిచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమైన ఎటువంటి మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు వాడలేదని నిర్ధారించుకునేందుకు ఈ పూర్తిస్థాయి స్క్రీనింగ్ చేపడుతున్నట్లు సంస్థలు తమ పైలట్లకు పంపిన అంతర్గత సందేశంలో పేర్కొన్నాయి. గురుగ్రామ్ అకాడమీలో శిక్షణ సమయంలో, విమానం నడిపిన తర్వాత బ్రీఫింగ్ సెంటర్లలో, ఇతర కార్యాలయాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రయాణికులు, భాగస్వాములకు భద్రతపై భరోసా కల్పించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్‌లైన్ వర్గాలు వెల్లడించాయి.ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో తీవ్రమైన కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానం అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తును కోల్పోవడంతో, సిబ్బంది సహా కనీసం 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.దశాబ్దాలుగా సంపాదించుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే గ్రూప్‌లోని పైలట్లందరికీ వెంటనే పూర్తిస్థాయి స్క్రీనింగ్ ప్రారంభిస్తున్నామని ఎయిరిండియా ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పైలట్లకు పంపిన